బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 యొక్క ఐదవ వారం నుండి మిడ్-వీక్ ఎవిక్షన్‌లో భాగంగా హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. అయితే తాజాగా ఈ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా ఢీ షో డ్యాన్సర్ నైనికా ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ తెలుగు 8 నైనికా ఎలిమినేషన్ నేటి (అక్టోబర్ 6) ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన నైనిక ఐదు వారాల వరకు ఉంది. కాబట్టి, ఈ ఐదు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా నైనిక ఎంత సంపాదించిందంటే… అయితే నైనిక కు వారానికి రూ. 2 లక్షల 20 వేలు (రోజుకు రూ. 31,428) పారితోషికం ఇచ్చారు. ఈ లెక్కన నైనికా బిగ్ బాస్ ద్వారా ఐదు వారాల్లో దాదాపు 11 లక్షల రూపాయలు సంపాదించింది. అదే 36 రోజులకు లెక్కిస్తే సుమారు రూ. 11, 31, 408 అందుకుంది. అది చూసిన నైనిక దాదాపు రూ. 11 లక్షల రెమ్యూనరేషన్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. నైనికా ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ప్రసారం కానుంది. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 ఈవెంట్‌లో 8 మంది వైల్డ్ కార్డ్ పోటీదారులు హౌస్‌లోకి ప్రవేశించనున్నారు.