మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు అంటే అశ్యర్యపోనక్కర్లేదు. ధోని ఫిటెనెస్, ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి ధోని ఓ ప్రెవేట్ పార్టీలో హుక్కా తాగుతూ కనిపించారు. దీంతో గతంలో జార్జ్ బెయిలీ ధోనీకి హుక్కా తాగడం ఇష్టమని చెప్పని మాటలు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఇది యాడ్ షూట్ కోసమా.. నిజంగా సేవించారా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.