దోనీ.. ఆ పేరుకు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉంది. అయితే దోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు ఏకంగా కన్నీరు పెట్టుకుంటున్నారు. దీంతో పాటు మరికొందరు ఆయన కేవలం క్రికెట్కు మాత్రమే దూరమయ్యారు జనాలకు కాదు అని అంటున్నారు. వారిలో ముఖ్యంగా బీజేపీ నాయకులు ఉన్నారు. దీంతో పాటు గత కొద్ది రోజుల కింద దోనీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆ అలోచనకు మంచి బలం చేకూరింది. ఇక దోనీ బీజేపీలో చేరతాడా వచ్చే ఎన్నికల్లో జార్ఖాండ్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తారా అంటే అవుననే అనిపిస్తుంది. దీనికి కారణం బీజేపీలో బలమైన నాయకుల్లో ఒకరైన సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా 2024 వచ్చే ఎన్నికల్లో దోనీ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలి అని కూడా చెప్పేస్తున్నాడు. అయితే దీనిపై దోనీ ఇప్పటికి స్పందించలేదు. దీంతో దోనీ బీజేపీలో చేరినా అసెంబ్లీకి వెలతాడో పార్లమెంటుకు వస్తాడో, రాష్ట్ర మంత్రి అవుతాడో, కేంద్ర మంత్రి అవుతాడో చూడాల్సిందే. ఇక దోనీ బీజేపీలోకి వస్తే మిస్టర్ కూల్ భవిష్యత్లో బీజేపీలో మంచి నాయకునిగా ఎదిగే అవకాశాలు ఎక్కవే ఉంటాయి.