Dhoni, Kohli hairstyle : సరికొత్త హెయిర్ స్టైల్‌తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేయడంలో ఎప్పటికప్పుడు ముందుంటారు స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ. వయసుతో సంబంధం లేకుండా క్లీన్‌లుక్‌లో కనిపిస్తూ గ్రౌండ్‌లో హీరోలా కనిపిస్తుంటారు. ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న మహీ లుక్ చూసి వింటేజ్ హీరోలా ఉన్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరి వీరికి ఆ స్టైల్‌లో హెయిర్ కట్ చేసేది ఎవరో తెలుసా? ఆలిమ్ హకిమ్. ఈయన ఇండియాలోనే ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్. ఒక్కో సెషన్‌కు కనీసం లక్ష రూపాయలు తీసుకుంటానని రీసెంట్‌గా ఓ మీడియా సంస్థ ద్వారా ఆయన తెలిపారు.