నిన్న చెన్నై-హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ శుభవార్త షేర్ చేసింది. తాను అత్త కాబోతున్నానంటూ శుభవార్త చెప్పింది. ధోనీ వికెట్ కీపింగ్ చేస్తున్న ఫోటోతో.. ‘దయచేసి నేటి మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా ఇదే నా అభ్యర్థన’ అంటూ సాక్షి తన ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. దీంతో మామ కాబోతున్న ధోనీకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.