దులీప్ ట్రోఫీలో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో భారత్-ఎ వర్సెస్ ఇండియా-బి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వే అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. 150/6 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్-బి 184 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగులు జోడించిన తర్వాత చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్ ఏడు క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో ధ్రువ్ అరుదైన రికార్డు సాధించాడు. దులీప్ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ధృవ్ జురెల్ వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేశాడు. 2004-05 సీజన్‌లో ఈస్ట్ జోన్ తరఫున ధోనీ ఈ ఘనత సాధించాడు. భారత్-ఎ తరఫున రెండు దశాబ్దాల తర్వాత ధ్రువ్ ఈ రికార్డును సమం చేశాడు. తర్వాత బెంజమిన్ (6 క్యాచ్‌లు, 1973-74), విశ్వనాథ్ (6 క్యాచ్‌లు, 1980-21) తర్వాతి స్థానంలో ఉన్నారు.