టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆటతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన నిరాడంబరత, వ్యక్తిత్వమే అందుకు కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ధోనీ బెంగళూరు నుంచి రాంచీకి ప్రయాణించాడు. ఆయన ఒక సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో ఇతరులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహీ నిరాడంబరతకు ఫిదా ఆయ్యారు.