మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఊటీలో ఫామ్‌హౌస్ కట్టబోతున్నారు అని తెలుస్తుంది. తమిళనాడులోని హిల్ స్టేషన్ ఊటీలో దాదాపు 16 కోట్లకు 6 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఫామ్ హౌస్ నిర్మించాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన అక్కడికి వెళ్లి సందర్శించారు అని సమాచారం. అప్పట్లో ఆయన చిత్రాల్లోని చాలా పాటల సన్నివేశాలను కూడా అక్కడే చిత్రీకరించారు. అందుకే చిరంజీవికి ఊటీ అంటే ప్రత్యేక అభిమానం అని అంటున్నారు.