Homeహైదరాబాద్latest Newsకన్న తల్లే హత్య చెయ్యాలనుకుందా..?

కన్న తల్లే హత్య చెయ్యాలనుకుందా..?

– అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని…

– కన్న కూతురినే హతమార్చేందుకు యత్నించిన తల్లి

ఇదేనిజం, నిజామాబాద్ ప్రతినిధి: ఓ కసాయి తల్లి అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని, ప్రియుడితో కలిసి తన కన్న కూతురినే హతమార్చేందుకు యత్నించింది. కన్న కూతురినే కడతేర్చాలని అనుకున్న తల్లి ఆకృత్యం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులోని నిజాంసాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్ నగరానికి చెందిన మైనర్ బాలిక, తీవ్ర గాయాలతో పడి ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ కేసును పోలీసులు విచారణ చేపట్టగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందని భావించి కన్న కూతురినే తల్లే హత్య చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఇందులో బాధితురాలి తల్లితో పాటు ఓ ఆటో డ్రైవర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

బాధితురాలి తల్లి తన ప్రియుడైన ఆటో డ్రైవర్తో కలిసి బాలికను జాన్కంపేట శివారులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతానికి తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. మెడకు ఉరివేయడంతో బాలిక కాసేపటికి మరణించిందని భావించి అక్కడే వదిలేసి పారిపోయారు. కాగా తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలికను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆస్పత్రికి తరలించారు. అయితే హత్యాయత్నానికి పాల్పడిన నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. కాగా ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రియుడి మోజులో, కని, పెంచి పెద్ద చేసిన కూతురిని హతమార్చాడినికి కుట్ర పన్నడం శోచనీయం. సమాజం ఎటుపోతోందని, ప్రతిరోజు అక్రమ సంబంధాల వార్తలు హెచ్చుమీరాయని మేధావులు ఆందోళన చెందుతున్నారు.

Recent

- Advertisment -spot_img