ప్రేమకు వయోపరిమితి లేదు. ప్రేమకు హద్దులు లేవు. ఇది ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు. హిందీ టెలివిజన్ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివంగి వర్మ ఇటీవల తన సోషల్ మీడియాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. కానీ ప్రేమకు వయసు లేదు, హద్దు లేదు అని లైన్ రాసింది. ఈ ఫోటో చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే శివంగి వర్మకు ఇప్పుడు 31 ఏళ్లు. ఇప్పుడు గోవింద్ నామ్‌దేవ్ వయసు 70 ఏళ్లు. అందుకే 31 ఏళ్ల వయసులో 70 ఏళ్ల నటుడితో ప్రేమలో ఎలా పడింది అని చాలా మంది శివంగి వర్మను అడగడం ప్రారంభించారు. మరికొందరు డబ్బు ఉంటేనే అన్నీ సాధ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోవింద్ నామ్‌దేవ్ ఆస్తి కోసమే శివంగి వర్మ ఈ లవ్ డ్రామా చేస్తున్నారని అంతా వ్యాఖ్యానించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శివంగి వర్మ వెల్లడించారు.
గత దశాబ్ద కాలంగా బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శివంగి వర్మ.. ప్రస్తుతం వెండితెరపైకి అడుగు పెడుతోంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పూర్తి హాస్య కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో గోవింద్ నామ్‌దేవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో గోవింద్ నామ్‌దేవ్ గత మూడు దశాబ్దాల్లో వందలాది సినిమాల్లో, విభిన్న పాత్రల్లో నటించారు. అలాంటి వెటరన్ ఆర్టిస్ట్‌తో శివంగి వర్మ తన మొదటి సినిమాతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్న శివంగి వర్మ.. గోవింద్ నామ్‌దేవ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ విషయం తెలియని పలువురు శివంగి వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివంగి వర్మ, గోవింద్ నామ్‌దేవ్ జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.