రాష్ట్రంలో అధికారంలోకి రావాలని YCP అధినేత జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందుకు అనుగుణంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా మార్చారు. అయినా ఫలితం లేకపోయింది. మార్చిన అందరు అభ్యర్థులూ ఓడిపోయారు. దీంతో ఎన్నికలకు ముందు ‘వై నాట్ 175’ అన్నYCP నేతలు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా ఖంగు తింటున్నారు. వారితోపాటు పలువురు మంత్రులు, కీలకనేతలు సైతం ఓటమిపాలయ్యారు.