తెలంగాణలో ఈ గణేశుడిని నిమజ్జనమే చేయరని మీకు తెలుసా? నిర్మల్ జిల్లా, కుభీర్ మండలంలోని సిర్పెల్లికి దగ్గరలో ఉన్న పాలజ్ (MH)లో కర్ర వినాయకుడిని పూజిస్తారు. ప్రతి ఏటా చవితికి బీరువాలో భద్రపరిచిన కర్ర వినాయకుడిని బయటకు తీసి 11 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల చివరిరోజు వాగుకు తీసుకెళ్లి నీళ్లు చెల్లి మళ్లీ భద్రపరుస్తారు. గత 75 ఏళ్లుగా వినాయకుడి విగ్రహాన్ని భద్రపరుస్తుండటం గమనార్హం.