ఒక్క కట్ల పాము మినహా మిగిలిన అన్ని పాములు కాటసే ముందు వివిధ శబ్ధాలతో మనల్ని హెచ్చరిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే అవి ప్రాణ భయంతో కాటేసే యత్నం లేదా సంకేతం ఇస్తాయి. కట్ల పాము ఒక్కటే ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేమట. ఒక వేళ పాము కాటుకు గురైతే ఆ వ్యక్తికి మనం మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి.