Homeహైదరాబాద్latest Newsభారత లైసెన్స్‌తో ఈ దేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చని మీకు తెలుసా..?

భారత లైసెన్స్‌తో ఈ దేశాల్లో డ్రైవింగ్ చేయొచ్చని మీకు తెలుసా..?

ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు స్థానిక రవాణా వ్యవస్థను ఉపయోగిస్తారు. అంతే కాకుండా, అక్కడ కార్లు లేదా ఇతర వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడానికి స్థానిక డ్రైవింగ్ లైసెన్స్ లేదా ప్రభుత్వం ఆమోదించిన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. కానీ కొన్ని దేశాలు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ను అనుమతిస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సౌతాఫ్రికా, స్వీడన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్తర్న్ ఐర్లాండ్, వేల్స్, యూఎస్ఏ దేశాల్లో భారత డ్రైవింగ్ లైసెన్స్‌ను ఓ ఏడాది పాటు అనుమతిస్తారు. ఇక ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో ఏడాది పాటు అనుమతిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో కేవలం 3 నెలలే అనుమతిస్తారు. అలాగే జర్మనీలో ఆరు నెలల పాటు భారత లైసెన్స్ ఉపయోగించుకోవచ్చు. కెనడాలో 60 రోజులు మాత్రమే భారత లైసెన్స్ చెల్లుతుంది.

Recent

- Advertisment -spot_img