HomeరాజకీయాలుDid you pay the cart to Karimnagar? Karimnagar కు బండి రూపాయిపనైనా చేశాడా?

Did you pay the cart to Karimnagar? Karimnagar కు బండి రూపాయిపనైనా చేశాడా?

– మతం పేరుమీద రాజకీయం చేసెటోళ్లను నమ్మొద్దు
– బండి సంజయ్​ కరీంనగర్​కు గుడి కూడా కట్టలేదు
– గుడి కట్టింది కూడా గంగుల కమలాకర్​
– మసీదులు తవ్వడానికి బండిని ఎన్నుకున్నామా?
– గంగుల మీద పోటీకి విపక్షాలు భయడుతున్నాయి
– మతం చిచ్చు పెట్టేవాళ్లను నమ్మకండి
– బీజేపీ, కాంగ్రెస్​ కు ఓటేస్తే ఢిల్లీకి వేసినట్టే
– కరీంనగర్​ ప్రజాఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్​

ఇదేనిజం, కరీంనగర్​: ఎంపీ బండి సంజయ్​ కరీంనగర్​ నియోజకవర్గానికి రూపాయి పనైనా చేశాడా? అని మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు. గత ఎన్నికల్లో బండి సంజయ్​ .. ఎమ్మెల్యే ఓటమి, హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెట్టి గెలిచారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు. బుధవారం కరీంనగర్​ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్​ మాట్లాడారు. గంగుల కమలాకర్​ మీద పోటీ చేసేందుకు కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు భయపడుతున్నారని పేర్కొన్నారు. డబ్బుల సంచులతో అడ్డంగా దొరికిపోయిన పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిని నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్​, బీజేపీకి ఓటేస్తే ఢిల్లీకి గులాములం అయినట్టేనని పేర్కొన్నారు. బండి సంజయ్​ కరీంనగర్​ లో ఒక్క గుడి కూడా కట్టలేదని విమర్శించారు.

గంగుల కమలాకర్​ టీటీడీతో సంప్రదించి ఇక్కడ గుడిని నిర్మించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చుక్కనీరు లేక అల్లాడిన కరీంనగర్​ జిల్లా ఇప్పుడు సజీవ జలధారలా కళకళలాడుతోందని పేర్కొన్నారు. అప్పర్ మానేరు నుంచి లోయర్​ మానేరు దాకా అన్ని ప్రాజెక్టులు జలకళతో కళకళలాడుతున్నాయని చెప్పారు. కరెంట్ బాగైంది.. సాగునీరు బాగైందని గుర్తు చేశారు. సంక్షేమపథకాలు కూడా అందరికీ అందుతున్నాయన్నారు. ప్రవళిక కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని .. ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయం చేసేందుకు వస్తున్నారని.. వాళ్లను ప్రజలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్​ ను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్​ మూడో సారి ముఖ్యమంత్రి అయితే.. ఐదు వేల రూపాయల పింఛన్​ రాబోతున్నదని గుర్తు చేశారు.

కరీంనగర్​కు నాలుగు మెడికల్ కళాశాలలు :

గతంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా లేని ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో నేడు నాలుగు మెడికల్​ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
గంగుల కమలాకర్​ కే దక్కుతుందని గుర్తు చేశారు. జిల్లాలో విద్య, వైద్యం బాగైందని గుర్తు చేశారు. మతం పేరిట చిచ్చు పెట్టిన సన్నాసులను నమ్మొద్దని సూచించారు. బండి సంజయ్​ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్​ లో పోటీ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్నారు. ఎల్బీ నగర్​ లో పోటీ చేయాల్నా? వేములవాడలో పోటీ చేయాల్నా? అని ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘గతంలో మోడీ దేవుడన్నా అని బండి సంజయ్​ అన్నారు. మోడీ ఎందుకు దేవుడు? 400 రూపాయలు చేసినందుకు దేవుడా? పెట్రోల్​ ధరలు పెంచినందుకు దేవుడా?’ అంటూ కేటీఆర్​ ఎద్దేవా చేశారు.

Recent

- Advertisment -spot_img