టాయిలెట్ సీటుపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీరు అక్కడ మొబైల్ వాడితే.. ఇన్పెక్షన్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఇన్ఫెక్షన్లు, డయేరియా, పేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, ఇంకా అంటువ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టాయిలెట్‌లో ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ వాడటం వల్ల కూర్చునే భంగిమ సరిగ్గా ఉండదు. దీంతో మెడనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.