ఇందిరమ్మ ఇండ్లకు మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. శుక్రవారం కూసుమంచిలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారని గుర్తు చేశారు.