‘యానిమల్’మూవీ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆయన విలన్‌గా ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాలో తన లెంగ్తీ క్యారెక్టర్‌పై ఆయన స్పందించారు. ‘డైరెక్టర్ నాకు పాత్ర గురించి చెప్పి 15 రోజుల షూటింగ్ మాత్రమే ఉంటుందని చెప్పారు. నిడివి తక్కువ అయినా కథ పరంగా ప్రాధాన్యమున్న పాత్ర అది. నాకు ఎంతో సవాల్‌గా అనిపించింది. ఈ స్థాయిలో విజయాన్ని మాత్రం ఊహించలేదు. నటనకు ఆస్కారమున్న పాత్ర దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన వారంతా నేను ఇంకా ఎక్కువ సమయం కనిపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. నటుడిగా ఇది నాకు ప్రశంసతో సమానం. కానీ, సినిమాలో మన పాత్ర నిడివి కంటే దాని ప్రభావం ఎంత అనేది ముఖ్యం. సందీప్ వంగాకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాతో ఆయన నా జీవితాన్ని మార్చేశారు’అని చెప్పారు. ఇక ఈ సినిమా విజయంపై బాబీ డియోల్ గతంలోనూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ మూవీ మంచి వసూళ్లు సొంతం చేసుకుంటోంది. మొదటి వారం రూ.563 కోట్లు గ్రాస్‌ను రాబట్టినట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ వీకెండ్ అది మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.