Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ విన్నర్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు.. ! కావాలనే విన్నర్ ని మార్చారా..?

బిగ్‌బాస్ విన్నర్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు.. ! కావాలనే విన్నర్ ని మార్చారా..?

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరుయ్యారు. బిగ్‌బాస్ విన్నర్ గా టాప్-5లో ఉన్న కంటెస్టెంట్ నిఖిల్ గెలిచారు. సీజన్ చివరి దశకు చేరుకున్నప్పుడు అవినాష్, గౌతమ్ కృష్ణ, నబీల్ ఆఫ్రిది, నిఖిల్, ప్రేరణ టాప్-5లో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ కృష్ణ ఫైనల్ కు చేరుకున్నారు. అయితే నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ విజేతగా నిలిచాడు. అయితే విజేతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటింగ్ శాతంలో నిఖిల్ కంటే గౌతమ్ కృష్ణ ముందున్నట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో గౌతమ్ కృష్ణనే విజేత అని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు నిఖిల్‌ని బిగ్ బాస్ నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. కానీ మా టీవీలో సీరియల్స్‌తో పాటు చాలా ప్రోగ్రామ్స్‌లో నిఖిల్ ఉండటంతో విజేతగా ప్రకటించారు అని తెలుస్తుంది. గౌత‌మ్ ఫ్యాన్స్ దీనిపై ప్ర‌ధానంగా మాట్లాడుకుంటున్నారు. ఓటింగ్ శాతాన్ని వెల్లడించాలని గౌతమ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img