HomeతెలంగాణEvening Weather : తెలంగాణాలోని ఆ ఊర్లో సాయంత్రం కాదు..

Evening Weather : తెలంగాణాలోని ఆ ఊర్లో సాయంత్రం కాదు..

Evening Weather : తెలంగాణాలోని ఆ ఊర్లో సాయంత్రం కాదు..

Evening Weather : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విలక్షణ నటుడు ఇప్పుడు బుల్లితెరపై వావ్ అనే షోతో ఎంతగా అలరిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మాంచి కిక్కిచే గేమ్ షో అంటూ ప్రేక్షకులకి ఈ గేమ్ షో ద్వారా మంచి వినోదాన్ని పంచుతున్నాడు.

ఇందులో పలు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా వేస్తూ గేమ్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు.

తాజాగా ఈషోలో సాయి కుమార్ వేసిన ప్రశ్న తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

వింత వాతావరణం..

తెలంగాణలో భౌగోళిక పరిస్థతుల కారణంగా సాయంకాల వాతావరణాన్నిఅనుభూతి చెందని గ్రామం ఏది అని అడగ్గా, దీనికి ఎవరు సమాధానం చెప్పకపోవడంతో సాయి కుమార్ పెద్దపల్లి సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక గ్రామం అని చెప్పారు.

ఇక్కడ ఉదయం 6 గంటలు అవుతుందంటే చాలు నెమ్మది నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతుంది.

మబ్బులను చీల్చుకు వచ్చిన సూర్యుడు మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి నడి నెత్తిమీదకు వస్తాడు.

ఈ కుదురుపాక గ్రామానికి చుట్టూ నాలుగు వైపుల గుట్టలు ఉన్నాయి.

ఈ ఊరికి నాలుగు దిక్కులా ఆవరించి ఉన్న గుట్టలు ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలపై ప్రభావం చూపిస్తున్నాయి.

తూర్పున ఉన్న గొల్లగుట్ట. ఈ గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. ఇక 4 గంటల ప్రాంతంలో సూర్యుడు.

గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు.

ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఇక్కడి ప్రజల నిత్యజీవితంపై కూడా పడుతోంది.

జనం తమ పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుంటారు.

ఊర్లో పని చేసుకునే మహిళలు మధ్యాహ్నం మూడు గంటల వరకే ఇంటికి చేరుకుని ఇంట్లో పనులు చేసుకుంటారట.

Recent

- Advertisment -spot_img