కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే దాదాపు 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు రకాల వ్యాక్సిన్ డోసులను ఇవ్వడం ద్వారా (తొలి డోస్‌గా ఒక వ్యాక్సిన్, రెండో డోస్‌గా మరో వ్యాక్సిన్) ఫలితం ఉంటుందా..? అనే కోణంలో కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తే అల్పాదాయ, మధ్య ఆదాయ దేశలకు వ్యాక్సినేషన్ సులభతరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖులు కూడా ఒక అధ్యయనం చేశారు.
వారు కరోనా బాధితులకు డోస్‌కు ఒక రకం చొప్పున రెండు ప్రముఖ కంపెనీలకు చెందిన కొవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు.
దాంతో నాలుగు వారాల తర్వాత వారిలో వికారం, అలసట, తల నొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం గుర్తించారు.
అయితే ఒకే వ్యక్తి కి రెండు విభిన్న వ్యాక్సిన్ డోసులు ఇచ్చే ప్రయోగం కరోనాను కట్టడి చేయడంలో ఏమేరకు ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధకులు వెల్లడించలేదు.
పరిశోధనలో భాగంగా ఫైజర్ టీకా డోస్‌గా తీసుకున్న తర్వాత ఆస్ట్రాజెనెకా టీకా రెండో డోస్‌గా తీసుకున్న వారిలో నాలుగు వారాల తర్వాత చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు గర్తించారు.
వారి అధ్యయనానికి సంబంధించిన రిపోర్టును ది లాన్సెట్ మెడికల్ జనరల్‌లో ప్రచురించారు.
వాక్సిన్‌ల మార్చి ప్రయోగించినప్పుడు కూడా బాధితుల్లో చిన్నచిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
పేద, మధ్యతరగతి దేశాలు టీకా కొరతను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పరిశోధకులు, ఆరోగ్య అధికారులు.. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు టీకాలు వేయడంవల్ల ఫలితం ఉంటుందేమోనని పరిశోధన చేస్తున్నారు.
ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఫస్ట్ డోస్‌గా ఎవరు ఏ టీకా తీసుకున్నా రెండో డోస్‌గా ఏదైనా టీకాను తీసుకోవచ్చు.
ఇది పేద, మధ్యతరగతి దేశాల్లో వ్యాక్సినేషన్‌ను, వ్యాక్సిన్‌ల నిలువను సులభతరం చేస్తుంది.