Homeఅంతర్జాతీయంDigital highways:డిజిటల్ హైవేగా హైదరాబాద్ -బెంగళూరు

Digital highways:డిజిటల్ హైవేగా హైదరాబాద్ -బెంగళూరు

Digital highways:

దేశ వ్యాప్తంగా 2024-25 ఆర్ధిక సంవత్సరం నాటికీ జాతీయ రహదారుల్లో 10 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది . అందులో భాగంగా 1367 కిలోమీటర్ల ఢిల్లీ -ముంబై express వే తో పాటు 512 కిలోమీటర్ల మేర హైదరాబాద్-బెంగళూరకారిడార్లను పైలట్ ప్రాజెక్ట్ కింద గుర్తించినట్లు వెల్లడించారు .

దేశంలో మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడంతో పాటు 5జీ ,6జీ వంటి సాంకేతికతలను మరింత వేగంగా విస్తరించేందుకు ఈ OFC నెట్వర్క్ ఉపాయో గపడుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది .హైవేలలో OFC వేసే ప్రక్రియ మొదలైందని ,మరో ఏడాదిలో పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ -ముంబాయి express way లో అందుబాటులో వచ్చిన 246 కిలోమీటర్ల ఢిల్లీ -దౌసా -లాల్ షొత్ మార్గంలో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వినియోగించుకునేందుకు మూడు మీటర్ల స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించామ ని పేర్కొన్నది . రహదారుల వెంట ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్లను అభివృద్ధి చేయడం ద్వారా OFC మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు డిజిటల్ హైవే విధానం దోహదం చేస్తుంది
ఈ ఓఎఫ్ సి ద్వారా ప్లగ్ అండ్ ప్లే లేదా ఫైబర్ ఆన్ డిమాండ్ పద్దతిలో టెలికాం | ఇంటర్నెట్ సేవలు పొందే వీలుంటుంది . నిర్దేశిత ధరకు ఈ సేవలను లీజుకు ఇస్తారు. దీని కేటాయింపులకు సంబంధించిన ట్రాయ్ తో చర్చించిన తర్వాత ఖరారు చేస్తామని కేంద్రం తెలిపింది.

Recent

- Advertisment -spot_img