ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం డిజిటల్ పేమెంట్స్‌లో ఆధిపత్యానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చెక్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లో వీటి వాటా దాదాపు 90 శాతంగా ఉంది. ఇవి గుత్తాధిపత్యం చెలాయిస్తాయని RBI ఆందోళనలో ఉంది. క్రెడ్, స్లైస్, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌లతో NPCI భేటీ కానుంది. వీటికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించేలా సూచనలు కనిపిస్తున్నాయి.