Homeహైదరాబాద్latest NewsDil Raju : దిల్ రాజ్ బిగ్ ప్లానింగ్.. ''బియాండ్ ఇమాజినేష‌న్'' అంటూ ట్విట్

Dil Raju : దిల్ రాజ్ బిగ్ ప్లానింగ్.. ”బియాండ్ ఇమాజినేష‌న్” అంటూ ట్విట్

Dil Raju : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే ముందుగా దిల్ రాజు (Dil Raju) పేరు వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. దిల్ రాజు సినిమాలు తీస్తే అవి సూపర్ హిట్లు అవడం కాయం అనే పేరు ఉంది. తాజాగా దిల్ రాజు రేపు భారీ ప్రకటన చేసాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ”బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్” అంటూ రేపు ఉదయం 11.08 గంటలకు బిగ్ అప్డేట్ ఉంది అని ట్వీట్ చేసింది.
మలయాళలో వచ్చిన ది మోస్ట్ వయొలెంట్ సినిమా ”మార్కో” డైరెక్టర్ హనీఫ్ అదేని తో దిల్ రాజు పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు అని సమాచారం. దీని గురించే రేపు దిల్ రాజు అప్డేట్ ఇస్తున్నాడు అని కొందరు అంటున్నారు. మరోవైపు తెలుగు డైరెక్టర్ వంశీ పైడిప‌ల్లి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నాడు అని రేపు వ‌చ్చే ప్ర‌క‌ట‌న ఆ సినిమా గురించే అని మరో కొందరు అంటున్నారు. ఏదేమైనా రేపు ఉద‌యం 11.08 గంట‌ల‌కు ఈ విష‌యంలో ఒక క్లారిటీ వ‌స్తుంది.

Recent

- Advertisment -spot_img