Homeహైదరాబాద్latest Newsశ్రీ తేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. ఆసక్తికర విషయాలు వెల్లడి..!

శ్రీ తేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. ఆసక్తికర విషయాలు వెల్లడి..!

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాత దిల్‌రాజు పరామర్శించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు వెంట డీసీసీ అధ్యక్షులు రోహిణ్‌ రెడ్డి ఉన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం.. తర్వాత జరగాల్సిన వాటిపై చర్చిస్తామని అన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రెండ్రోజుల్లో వెంటిలేటర్‌ పైనుంచి షిఫ్ట్ చేస్తామని వైద్యులు చెప్పారని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని తెలిపారు. ప్రజలకు మీడియా వాస్తవాలు చూపించాలని కోరారు. అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని, నటుడు అల్లు అర్జున్‌ను ఇద్దరినీ కలిశానని అన్నారు.

Recent

- Advertisment -spot_img