భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్.. టీ20 క్రికెట్‌లో కొత్త జర్నీని ప్రారంభించనున్నారు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆయన ఆడనున్నారు. 2025లో మొదలు కానున్న సౌతాఫ్రికా టీ20 (SA20)లీగ్‌లో పార్ల్ రాయల్స్ జట్టుకు కార్తిక్ ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా ఐపీఎల్ నుంచి కూడా దినేశ్ కార్తిక్ రిటైర్ అయ్యారు. 2024లో జరిగిన ఐపీఎల్.. దినేశ్ కెరీర్‌లో ఆఖరిది. టీ20 వరల్డ్ కప్ 2024లో కామెంటేటర్‌గా కనిపించాడు.