జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ ‘క్రిష్’ ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు. అతను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘గమ్యం’కి ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని పొందాడు. ఆ తర్వాత ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మొదలైన సినిమాలని డైరెక్ట్ చేసాడు. తాజాగా దర్శకుడు క్రిష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. క్రిష్ కొన్నాళ్ల క్రితం రమ్య అనే వైద్యురాలిని పెళ్లాడాడు. అయితే పెళ్లిలో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న క్రిష్ తాజాగా రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇందులో భాగంగా వచ్చే వారం నిశ్చితార్థం కూడా జరగనుంది. అయితే ఇక్కడ విశేషమేమిటంటే.. గతంలో ఓ డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు.. అయితే ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోబోయేది కూడా డాక్టర్ నేనట. ఆమెకు ఓ దర్శకుడితో పెళ్లయిందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ఇండస్ట్రీ టాక్. త్వరలో వీరి నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన ప్రకటన రానుంది.