తెలుగు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రీతి చల్లా అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు. క్రిష్ గతంలో ప్రముఖ డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నాడు. అయితే వివిధ కారణాల వల్ల ఆమెతో 2018లో విడాకులు తీసుకున్నాడు. అయితే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి అనే చెప్పాలి. హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. డాక్టర్ ప్రీతి చల్లా 2007 నుండి మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రీతి చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయంలో MBBS చేసింది.