లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ వేస్తోన్న పిటిషన్లకు కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా వైద్య పరీక్షల నిమిత్తం వర్చువల్ కన్సల్టేషన్ కావాలని ఆయన తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. జైల్లో అందరికీ ఒకే తరహా వైద్యం ఉంటుందని, జైలు డాక్టర్లే వైద్యం చేస్తారని న్యాయస్థానం పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డల్ అయ్యారు.