Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ అభిమానులకు నిరాశ.. 'దేవర' మూవీ సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్..!

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ.. ‘దేవర’ మూవీ సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్..!

తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అయితే ఎన్టీఆర్ అభిమానులకు దేవర మూవీ మేకర్స్ భారీ షాక్ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ను నిర్వహించడం లేదు అని తెలిపారు.

ఈ క్రమంలో నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేసారు….”బాక్స్ ఆఫీస్ వద్ద అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, మా భారీ విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము….ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు మరియు ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరికీ మరియు మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. ఎన్టీఆర్ అన్నను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళే శక్తిగా మీరు అర్థం చేసుకుని కొనసాగుతారని ఆశిస్తున్నాము” అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img