Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ హౌస్‌లో కమ్యూనిటీపై చర్చ.. అప్పుడే ఓట్లు చీలకుండా ఉంటాయి.. అంటున్న ఆ ఇద్దరు కాంటెస్ట్స్...

బిగ్‌బాస్ హౌస్‌లో కమ్యూనిటీపై చర్చ.. అప్పుడే ఓట్లు చీలకుండా ఉంటాయి.. అంటున్న ఆ ఇద్దరు కాంటెస్ట్స్ ..!

తెలుగు ‘బిగ్‌బాస్ సీజన్ 8’ హోరాహోరీగా సాగుతోంది. బిగ్‌బాస్ హౌస్‌లో తొలిసారిగా కమ్యూనిటీ గురించి చర్చించుకోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోపై చుసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కంటెస్టెంట్‌గా నబీల్ అఫ్రిది తన ఆటతో అందరిని ఆకర్షించాడు. అయితే ఈ మధ్య హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా మెహబూబ్ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ ఇద్దరు బిగ్ బాస్ హౌస్‌లోని కమ్యూనిటీపై గురించి మాట్లాడుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వీడియోలో మెహబూబ్ మాట్లాడ్తూ.. ‘మనకు దారుణమైన ప్లస్ ఏంటి అంటే మనకు మన కమ్యూనిటీ ఉంది. ఆ ఓట్లు కూడా మనకు పడతాయి. కానీ మన ఇద్దరం ఒక విషయాన్ని గ్రహించాలి. అదేంటంటే.. నామినేషన్స్ లో మన ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి. ఇద్దరూ ఉండకూడదు. అప్పుడే ఓట్లు చీలకుండా ఉంటాయి’ అని మెహబూబ్ అన్నాడు. ఆ మాటలు వింటున్న నబిల్ కూడా అవును అంటూ తల ఊపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన బిగ్ బాస్ ఆడియెన్స్ మెహబూబ్, నబీల్ పై మండి పడుతున్నారు.

Recent

- Advertisment -spot_img