ముంబాయిః బాలీవుడ్ నటీమణి దిశా పటాని తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచేసింది. కత్రినా కైఫ్, దీపికా పదుకుణె, ప్రియాంక చొప్రా, కియారా అడ్వానీ, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్, అదితీ రావు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి తారలను వెనక్కునెట్టి ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019గా నిలిచింది. ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా టైమ్స్ ఆఫ్ ఇండియా జరిపిన సర్వేలో నెటిజన్లు పాల్గొని తమకు నచ్చిన యాభై మంది అందాల తారలను ఎంచుకున్నారు. దీనిపై దిశా స్పందిస్తూ ఫిట్‌గా ఉండేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తానని, నన్ను ఎన్నుకున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ తన ఆనందాన్ని పంచుకుంది. దిశా ఇటీవలే భాఘి-3, మలంగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది.