Homeహైదరాబాద్latest NewsDisneyland Park in India: భారత్‌లో ‘డిస్నీలాండ్’ థీమ్ పార్క్.. పర్యాటక రంగంలో కొత్త శకం..!

Disneyland Park in India: భారత్‌లో ‘డిస్నీలాండ్’ థీమ్ పార్క్.. పర్యాటక రంగంలో కొత్త శకం..!

Disneyland Park in India: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో భారతదేశపు తొలి డిస్నీలాండ్ థీమ్ పార్క్‌ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్ట్ మానేసర్ పచ్గావ్ చౌక్ సమీపంలో 500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఈ థీమ్ పార్క్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గణనీయంగా పెంచడమే కాకుండా, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని సీఎం తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ హర్యానా ఆర్థిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఊతం ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్ ద్వారా గురుగ్రామ్ భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుంది, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి లభించనుంది.

Recent

- Advertisment -spot_img