గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ జరుగనుంది. ఈ పిటిషన్ పై ఇప్పటికే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు సీజే బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరుగనుంది. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోర్టు ఆదేశిస్తే వారు తమ పదవులను కోల్పోనున్నారు.