రిలయన్స్‌కు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. మొబైల్ సిగ్నల్స్, ఇంటర్‌నెట్ పని చేయడం లేదని వేలాది మంది జియో యూజర్లు సోషల్ మీడియాలో మంగళవారం పేర్కొన్నారు. నో సిగ్నల్ అని వస్తోందని, ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని ఎక్స్ (ట్విటర్)లో వాపోయారు. జియో డౌన్, జియో ఓటేజ్ ప్రస్తుతం ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. జియో సర్వీసులు డౌన్ అవడంపై సంస్థ ఇంకా స్పందించలేదు.