హైదరాబాద్ : రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గించేందుకు హెచ్ఎండిఏ కృషి చేస్తోంది. గత ఎనిమిది సంవత్సరాలుగా గణపయ్య లను పంపిణీ చేస్తోంది. అందులో భాగంగా 50 వేల మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. కుమ్మరి కులవృత్తి దారులతో సంప్రదాయ మట్టి గణపతులను తయారు చేయించి, స్వచ్ఛంద సంస్థల సాయంతో ప్రజలకు పంపిణీ చేస్తుంది. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ,హుస్సేన్‌సాగర్ శుద్ధి సాధ్యమవుతుందని హెచ్ఎండిఏ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.