Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ వివాహ రజతోత్సవ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ వివాహ రజతోత్సవ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన హరిజన వాడ లో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారి వివాహ రజతోత్సవ సందర్భంగా విద్యార్థులందరికి నోట్ బుక్స్ పంపిణీ చేసి తదనంతరం కేక్ కట్ చేసి వేడుకలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి మాట్లాడుతూ 14 సంవత్సరాలు వనవాసం తర్వాత విజయతీరాలకు చేరామని, కాబట్టి విద్యార్థులు ఓటమిలకి కృంగి పోకుండా శ్రమని నమ్ముకొని విజయలక్ష్యం ను చేరుకోవాలి అని కష్టాలు సామర్థ్యాన్ని బయటికి తీస్తాయి, అవమానాలు ఒకొక్క మెట్టు ఎక్కేలా చేస్తాయి, హేళనలు విజయానికి, పట్టుదల కసిని పెంచి దోహదపడతాయని అన్నారు. ఆగస్టు 10న తమ వివాహ రజతోత్సవ వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి గారు సంతోషాన్ని పాఠశాల విద్యార్థులతో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కనక తార,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు మాధవి,ఉపాధ్యాయులు బుగ్గరపు హరీష్,రొట్టె సరిత,గజ్జెల్లి సునీత తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img