Homeహైదరాబాద్నంది ఎల్లయ్య జ్ఞాపకార్ధంగా నిత్యావసర సరుకుల పంపిణీ

నంది ఎల్లయ్య జ్ఞాపకార్ధంగా నిత్యావసర సరుకుల పంపిణీ

మల్కాజిగిరి: దివంగత నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య జ్ఞాపకార్ధంగా మల్కాజిగిరి ఉప్పరిగూడలోని మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ నివాసంలో 800 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్య వసర సరుకులను మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పంపిణీ చేశారు. నంది ఎల్లయ్య 1964 నుండి రాజకీయ జీవితం ప్రారంభమైంది అంచలంచలుగా ఎంపీగా ఐదు సార్లు, రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆయన చేసిన సేవలను మల్కాజిగిరి ప్రజలు ఎన్నటికీ మరువలేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య అభిమానులు రామకృష్ణ, బోనగిరి సురేష్ యాదవ్, విఠోభ ఖుద్ధూస్, ఆసర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img