ఇదేనిజం, బొల్లారం : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని డిజైర్ సొసైటీలో మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్త చిన్నారులకు మాజీ ZPTC బాల్రెడ్డి, మున్సిపల్ శాఖ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. చిన్నారులు మాజీ మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, సొసైటీ ప్రతినిధులు, చిన్నారులు పాల్గొన్నారు.