Homeజిల్లా వార్తలుఉప్పల్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

ఉప్పల్ లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

-వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
-అంగవైకల్యము శరీరానికే గాని మేధస్సుకు కాదు : ఎమ్మెల్యే

ఇదే నిజం, ఉప్పల్: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , ఎమ్ఆర్ఓతో కలిసి
సైనిక్ పూరిలో కాప్రా సర్కిల్ కి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగవైకల్యం శరీరానికే గాని మేధస్సుకు కాదని, అధైర్య పడకుండా ముందుకు నడవాలని మీరు కూడా చట్టసభల్లో చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లురి అంజ, బిఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు సాయి జెన్ శేఖర్, వికలాంగుల సంక్షేమం సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img