నేరెడ్మెట్, ఇదేనిజం : మల్కాజిగిరి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. గురువారం నేరెడ్‌మెట్‌లోని ఎంఆర్ఓ ఆఫీస్‌లో 136వ డివిజన్లో నివసించే 15 మంది లబ్దిదారులకు, 137వ డివిజన్‌కు చెందిన 43 మందికి, 138వ డివిజన్‌కు చెందిన 36 మందికి, 139వ డివిజన్‌కు చెందిన 27 మందికి, 140వ డివిజన్‌కు చెందిన 16 మందికి, 141వ డివిజన్‌కు చెందిన 14 మందికి మొత్తం 151 చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంఆర్ఓ మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు శ్రీదేవి, జగదీష్ గౌడ్, బద్దం పుష్పాలత రెడ్డి, నాయకులు ప్రేమ్ కుమార్, పరిశురాం రెడ్డి, రాముయదవ్, సతీష్ కుమార్, ఆమినుద్దీన్, మడిపడిగే జగదీష్ గౌడ్, టిక్కమ్, రాజు తదితరులు పాల్గొన్నారు.