– ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్
ఇదే నిజం, దేవరకొండ: చింతపల్లి మండలంలో శనివారం పలు గ్రామాలకు చెందిన 50 మంది కళ్యాణాలక్ష్మి లబ్దిదారులకు దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నదని తెలిపారు. కళ్యాణాలక్ష్మి క్రింద రూ.10,116తో పాటు తులం బంగారాన్ని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారులకు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆరు గ్యారంటీలను విడతల వారిగా త్వరలో పూర్తి చేస్తారని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్ ప్రారంభమయింది, త్వరలో 500 రూపాయలకు గ్యాస్, గృహాలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు కరెంటు ప్రీ కూడా ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్, ఎంఆర్ఓ శంషాద్దీన్, ఎంపీడీఓ సుజాత, డీటీ హర్షద్, ఆర్‌ఐ యాదయ్య, డీసీసీ ఉపాధ్యక్షులు దొంతం సంజీవ రెడ్డి, ముచ్చర్ల యాదగిరి, కాయితి జితేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ యాదవ్, వెంకటయ్య గౌడ్, హరి నాయక్, లింగంపల్లి వెంకటయ్య, సలీమ్, జంజీర్, శ్రీను, జంగయ్య, నర్సింహ రెడ్డి, వెంకటయ్య, అంజిరేకుల గోవర్ధన్, జగదీష్, రవి, తీదేడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు శివర్ల శంకర్ యాదవ్, ఈడమోని శ్రీనివాస్ యాదవ్, దాసరి మారయ్య, కొరివి యాదగిరి, మర్రు మీనా రావు, కల్లు శ్రీను, రాములు, గునమోని కొండల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.