Homeహైదరాబాద్latest Newsఇస్రాజ్ పల్లెలో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ

ఇస్రాజ్ పల్లెలో విద్యార్థులకు నోట్‌బుక్‌ల పంపిణీ

ఇదే నిజం, గొల్లపెల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఇస్రాజ్ పల్లె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సొసైటీ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు డా.బిషప్ డేవిడ్ అంతర్పుల వారి బాల్య స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ పిల్లలందరూ కూడా చదువులోనూ ఆటల్లోనూ ఎదగాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇస్రాజ్ పల్లె గ్రామ కార్యదర్శి సౌమ్య,మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్ గౌడ్,ప్రధానోపాధ్యాయులు ఉదయశ్రీ, ఉపాధ్యాయులు వేదవతి, ప్రభాకర్, సీఆర్పీ చిర్ర లచ్చయ్య, శ్రీనివాస్, చిర్ర సత్తయ్య, చిర్ర జాను, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img