ఇవాళ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తామని ఏపీ సర్కార్ తెలిపింది .దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు.. వృద్ధులు వితంతువులకు మాత్రమే ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.
ఇతరులు సచివాలయం వద్ద తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఈ నెల 6 లోగా పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.