Homeహైదరాబాద్latest NewsUpendra సినిమా రీ రిలీజ్​ పోటీ పడుతున్న Distributors

Upendra సినిమా రీ రిలీజ్​ పోటీ పడుతున్న Distributors

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తోంది. ఒకప్పుడు హిట్ గా నిలిచిన సినిమాలు ఇప్పుడు రీరిలీజ్ అవుతున్నాయి. మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంటూనే అందర్నీ అలరిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర క్రేజీ ఫిల్మ్ కూడా కూడా రిలీజ్ అవబోతుంది. కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్రకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కథనంతో తెరకెక్కిన ఉపేంద్ర సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కన్నడ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ‘A’. 1998లో రిలీజైన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ సూపర్ డూపర్ హిట్టైంది. కేవలం కోటిన్నర తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 20కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ‘A’ సినిమాకు కథ, దర్శకత్వం మొత్తం ఉపేంద్రనే అందించారు. ఇండియన్ సినిమాల్లో రివర్స్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఏకైక సినిమాగా నిలిచింది ఉపేంద్ర ‘A’. ఇక ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ కానుందని తెలిసి అభిమానులు ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ మూవీ రీ రిలీజ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img