ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ను ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై, నూతన చట్ట ల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఎస్పీ వెంట సీఐ రామ్ నరసింహారెడ్డి రెడ్డి,ఎస్.ఐ ఉదయ్ కుమార్ , మరియు సిబ్బంది పాల్గొన్నారు.