Homeజిల్లా వార్తలుడివిజన్ ఐ ఎన్ టి యు సి327 యూనియన్ (విద్యుత్ కార్మికుల)జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే నేనావత్...

డివిజన్ ఐ ఎన్ టి యు సి327 యూనియన్ (విద్యుత్ కార్మికుల)జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

ఇదే నిజం దేవరకొండ: కొండమల్లెపల్లి మండల కేంద్రంలో దేవరకొండ డివిజన్ ఐ ఎన్ టి యు సి 327 యూనియన్ (విద్యుత్ కార్మికుల) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేనే వద్ద బాలు నాయక్ హాజరయ్యారు. అనంతరం ఐ ఎన్ టి యు సి జెండాను ఆవిష్కరించారు అనంతరం జనప్రియా గార్డెన్ లో ఏర్పాటు చేసిన యూనియన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. టి ఆర్ కె వి సిసంఘం నాయకులు ఎమ్మేల్యే మరియు ఐ ఎన్ టి యు సి సంఘం నాయకుల సమక్షంలో ఐ ఎన్ టి యు సి327 యూనియన్ లో చేరారు.
అనంతరం ఎమ్మెల్యేని నాయకులు ఘనంగా గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రెటరీ ఇనుగాల శ్రీధర్, డివిజన్ సెక్రెటరీ ఎండి నిరంజన్ అలీ,మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి,మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య,దేవరకొండ పట్టణ అధ్యక్షులు యూనిస్,నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్,నాయకులు మురళీ,చెన్నరం ఎంపీటీసీ జగన్ నాయక్, మాజీ ఎంపీటీసీ లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img