ఓ భర్త వేరే అమ్మాయితో అక్రమ సంభంధం పెట్టుకొని తన సొంత భార్యను నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ఆ వేధింపులకు విసిగిపోయిన ఓ భారతీయ మహిళ విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇప్పుడు ఆమెకు 59 సంవత్సరాల వయస్సు. ఆ మహిళ తన కంటే 20 సంవత్సరాలు చిన్న వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మ్యాటర్ తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ వారు పెళ్లి చేసుకున్నారు. 28 సంవత్సరాల క్రితం విడాకుల జీవితం తర్వాత ఆమె ప్రేమలో పడింది. మూడేళ్ల ప్రేమ జీవితం తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం మహిళ వయస్సు 59 సంవత్సరాలు, ఆమె భర్త వయస్సు 39 సంవత్సరాలు. విడాకుల తరువాత ఇప్పుడు వివాహం చేసుకున్న గీతా అనే మహిళ స్టోరీని ఇన్స్టాగ్రామ్ యూజర్ పీపుల్ ఆఫ్ ఇండియా షేర్ చేశారు. గీతా జీవిత కథ, ఆమె పోరాటం గురించి వీడియో తీసిపెట్టారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన నిఖిల్‌ని పెళ్లి చేసుకున్నట్లు గీతా వీడియోలో వెల్లడించింది. నా భర్త వివాహేతర సంబంధం కారణంగా తన మొదటి వివాహం నరకంలా తయారైయ్యిందని గీతా వివరించారు. తన భర్త చెడు వ్యసనాల కారణంగా 28 ఏళ్ల క్రితం తన పెళ్లి బంధం తెగిపోయిందని, అప్పటి నుంచి తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని గీతా వివరించారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను నిఖిల్‌ని కలిశానని, తాను డిప్రెషన్ నుంచి బయటపడి సాధారణ జీవితం గడిపేందుకు ఆయన సహకరించారు అని గీతా తెలిపారు.