అన్నమయ్య జిల్లా రాజంపేటలో మందు ప్రియులకు కిక్కు ఇచ్చే దివాళీ బొనాంజా ఆఫర్ ప్రకటించారు బార్లు, వైన్స్ షాప్ యజమానులు. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, ఓ గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ఇచ్చారు. దీనిపై బ్యానర్లను సైతం వేయించడంతో చూసే వాళ్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. మందుబాబులకు దీపావళి పండుగ ఒకరోజు ముందుగానే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు.