Homeహైదరాబాద్latest Newsపాఠశాలకు డీజే మైక్ సెట్, ఫ్యాన్లు బహుకరణ

పాఠశాలకు డీజే మైక్ సెట్, ఫ్యాన్లు బహుకరణ

ఇదేనిజం, ధర్మపురి : గొడిసెలపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు చింతల వెంకటేశం అనే వ్యక్తి డీజే బాక్స్, మైక్ సెట్, సీలింగ్ ఫ్యాన్లను బహుకరించారు. పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయురాలు మునీంద్ర కు అందజేశారు. మానవతా దృక్పథంతో పాఠశాల అవసరతలను తీర్చడం హర్షనీయమని మునీంద్ర అన్నారు. సుమారుగా 35 వేల విలువైన వస్తువులను బహూకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు బి. చంద్రశేఖర్, సిహెచ్. వెంకటస్వామి, పి.అశోక్ కుమార్ లతోపాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img